ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల అణ్వస్త్రాలు ఉన్నాయి: డోనాల్డ్ ట్రంప్
NEWS Nov 07,2025 12:01 pm
అణ్వాయుధ పరీక్షలు చేపట్టేందుకు జారీ చేసిన ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. అమెరికా వద్ద పుష్కలమైన అణ్వాయుధాలు ఉన్నాయని, ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేంతగా ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. ఆ అణ్వాయుధాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని, ఇతర దేశాల తరహాలో తాము కూడా న్యూక్లియర్ వెపన్స్ పరీక్షిస్తామని, ప్రస్తుతం తాము మాత్రమే టెస్ట్ చేయడం లేదని, పరీక్షలు చేపట్టని దేశాల జాబితాలో తాము ఉండడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు.