వాటర్ ప్లాంట్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్
NEWS Nov 07,2025 12:11 pm
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వాటర్ ప్లాంట్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని వాటర్ ప్లాంట్ యజమానులకు పిలిచి ఐఎస్ఐ మార్కు పర్మిషన్ తెచ్చుకోవాలని 2 నెలల గడువు ఇస్తున్నామని తెలిపారు. మీరు ఇప్పుడు సప్లై చేసే మంచినీటిని శుద్ధి చేయాలని, వినియోగించే ప్లాస్టిక్ డబ్బాలను శుభ్రంగా కడిగి మంచినీరు అందివ్వాలని, మంచినీటి వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, మంచినీరు కలుషితం వల్ల ప్రజలు జ్వరాల బారినపడి అనారోగ్యాల పాలవుతారని, మంచినీరు కలుషితం కాకుండా చూడాలని తెలిపారు. సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ ముజీబ్, సిబ్బంది పాల్గొన్నారు