జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఎండి సోహైల్
NEWS Nov 07,2025 12:05 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి సోహైల్ తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు రావు ఆదేశాల మేరకు మెట్ పల్లి మైనార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి గంగుల వివేక్ వెంకటస్వామి సారధ్యంలో జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మెట్ పల్లి పట్టణానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ మహమ్మద్, ఎండి తలహ తదితరులు పాల్గొన్నారు.