రష్మిక-విజయ్ పెళ్లికి డేట్, వేదిక ఫిక్స్?
NEWS Nov 06,2025 10:37 pm
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లికి అంతా రెడీ చేస్తున్నారట. ఉదయపూర్ ప్యాలెస్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి జరగబోతున్నట్లు టాక్. ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.