నాలుగో టీ20లో భారత్ ఘన విజయం!
NEWS Nov 06,2025 10:28 pm
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (30; 24 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మ్యాథ్యూ షార్ట్ (25; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.