నా ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన
జీతమా ఇది: రోదించిన తండ్రి
NEWS Nov 06,2025 03:38 pm
చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయి, నష్ట పరిహారం తీసుకుంటూ బోరున విలపించాడు తండ్రి ఎల్లయ్య గౌడ్. ప్రభుత్వం తరుపున ముగ్గురు కూతుళ్లకు ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున, రూ.21 లక్షల చెక్కు అందించారు. నష్ట పరిహారం అందుకుంటూ నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ. 60 వేలు సంపాదించేది, ఇప్పుడు ముగ్గురు కలిసి నాకు పంపించిన జీతమా ఇది అంటూ రోదించాడు తండ్రి.