ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా జట్టును ప్రధాని మోదీ కలిశారు. ఒక్కక్కరితో మాట్లాడిన ఆయన వారిని అభినందించారు. తెలుగు పేసర్ అరుంధతి రెడ్డి మాట్లాడుతూ, “మా అమ్మకు మీరు హీరో. మీతో కలవాలని ఆమె 4-5 సార్లు ఫోన్ చేసింది” అని చెప్పింది. మోదీ నవ్వుతూ స్పందించారు. హర్మన్ ఫైనల్ బంతిని తన దగ్గర ఉంచుకున్నట్లు చెప్పగా, హర్లీన్ డియోల్ సరదాగా “మీ స్కిన్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది, రహస్యమేమిటి?” అని అడగడంతో నవ్వులతో మారుమోగింది. ‘నేను వాటి గురించి ఆలోచించను’ అంటూ మోదీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.