హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్
NEWS Nov 06,2025 11:56 am
అమెరికా స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో ముంబై తర్వాత తన 2వ ఆఫీసు కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంది. హైటెక్ సిటీలో 40వేల చ. అడుగుల ఆఫీస్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రపంచ కార్యకలాపాలకు ఈ ఆఫీసు బ్యాక్ బోన్ మాదిరిగా ఉండబోతుందని తెలుస్తోంది. నగరంలోని బలమైన టెక్ ఇన్ ఫ్రా, టాలెంటెడ్ యువత ఈ నిర్ణయానికి కారణంగా చెబుతోంది స్ట్రీమింగ్ కంపెనీ. నెట్ ఫ్లిక్స్ రాకతో వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రం నుంచి పోస్ట్ ప్రొడక్షన్, VFX ఆపరేషన్స్ ఇక్కడి నుంచి నిర్వహించనుందని తెలుస్తోంది.