భీమలింగేశ్వరాలయంలో కార్తీకపౌర్ణమి వేడుకలు
NEWS Nov 06,2025 11:58 am
బంగారు మెట్ట–పీ.భీమవరం రోడ్డులో వెలసిన భీమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమరాన సింహాద్రి అప్పన్న (దాస్) ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణ మధ్య ధూపదీపాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల ‘హర హర మహాదేవ’ నినాదాలతో ఆలయం పరిసరాలు మారుమ్రోగాయి.