2 కొత్త జిల్లాలు.. 6 రెవెన్యూ డివిజన్లు
NEWS Nov 06,2025 11:44 am
అమరావతి: APలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనుంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణా జిల్లాలో చేర్చేలా ప్రతిపాదించారు. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు తిరిగి చేర్చనున్నారు. కొత్తగా మడకశిర, అద్దంకి, గిద్దలూరు వంటి 6 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుపై సానుకూలత ఉంది. జిల్లాల సరిహద్దు మార్పులపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక సీఎంకు అందజేయనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు.