'ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపండి'
NEWS Nov 06,2025 11:00 am
TG: ఏపీలో ఉన్న 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెంను తిరిగి విలీనం చేయాలని కోరారు. ఇందుకోసం 2 రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం.