పదో తరగతి విద్యార్థుకు పరీక్ష ఫీజు
చెల్లించాలని బండి సంజయ్ నిర్ణయం!
NEWS Nov 05,2025 11:36 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజును తాను చెల్లిస్తానని ప్రకటించారు. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరి పరీక్ష ఫీజుల కోసం దాదాపు రూ. 15 లక్షలు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని తన వేతనం నుంచి చెల్లించాలని బండి సంజయ్ నిర్ణయించారు.