ప్రధానిని కలిసి ప్రపంచ కప్ విజేతలు
NEWS Nov 05,2025 11:28 pm
మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు ప్రధాని మోదీని కలిసింది. వారికి మోదీ ఆతిథ్యం ఇచ్చారు. వరల్డ్ కప్ విశేషాలను టీమ్ఇండియా క్రీడాకారిణులు మోదీతో పంచుకున్నారు. వరల్డ్ కప్ ఛాంపియన్లకు ప్రధాని అభినందనలు తెలిపారు. వరుసగా 3 ఓటములు, సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్‌ను సైతం ఎదుర్కొని గొప్ప విజేతగా నిలిచారంటూ ప్రశంసించారు. ప్లేయర్లు ప్రధానికి వరల్డ్ కప్ ట్రోఫీతోపాటు ‘నమో 1’ జెర్సీని అందజేశారు.