కార్తీక పౌర్ణమి సందర్బంగా దీప కాంతులతో ఆలయాలు వెలిగిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు మంగళ హారతులతో ఆలయాలకు చేరుకొని ఉసిరి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి పరమశివుడికి ఇష్టమైన రోజని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు కూడా దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.