గూడెం గ్రామానికి విద్యుత్ వెలుగులు
NEWS Nov 05,2025 07:55 pm
తిమ్మాపూర్ మండలం గూడెం గ్రామానికి ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం లభించింది. ఇంతవరకు కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ గ్రామ ఆదివాసీలు గత నెల 11న కాగడాలతో నిరసన తెలిపారు. ఆ నిరసనపై స్పందించిన జిల్లా విద్యుత్ అధికారులు గ్రామాన్ని సందర్శించి, నెల రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారులు సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, గ్రామంలో విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి పట్ల కృతజ్ఞతలు తెలిపారు.