పాడేరు: మత్స్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్న
ITDA ప్రాజెక్ట్ అధికారి శ్రీ తిరుమణి శ్రీపూజా
NEWS Nov 05,2025 07:46 pm
మత్స్యగుండం: కార్తీక పౌర్ణమి సందర్భంగా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ మత్స్య గుండం శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేయగా, సర్పంచ్ మఠం శాంత కుమారి, ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ప్రాజెక్ట్ అధికారి తొలిసారి స్వామివారి దర్శనం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.