ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఇంటిని BRS నేతలు ముట్టడించారు. పత్తి కొనుగోళ్ల పరిమితి పెంపు డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు వారు యత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు BRS నేతలను అదుపులోకి తీసుకున్నారు.