లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ
NEWS Nov 05,2025 11:16 am
అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతి నేతలు సత్తా చాటారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ గెలిచా రు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళ. గజాలా హష్మీ 1964లో హైదరా బాద్‌లో జన్మించారు. బాల్యంలో మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో నివసించారు. ఆమె తాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేశారు. నాలుగేళ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు.