చోడవరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా
ఏపీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NEWS Nov 05,2025 01:28 pm
చోడవరం: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీజేఎఫ్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నవంబర్ 5న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చోడవరం ప్రెస్ క్లబ్ సభ్యులు బుచ్చయ్యపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నాయకులు శరగడం రాజు, ఉండా తాతారావు, యూనియన్ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొని రోగులకు ధైర్యం నింపారు.