లండన్: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అందుకున్నారు. లండన్ గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఐవోడీ సంస్థ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డునూ భువనేశ్వరికి అందజేశారు. చంద్రబాబు చీఫ్ గెస్టుగా పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ- సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గానూ భువనేశ్వరికి ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ పురస్కారాన్ని అందించారు.