AP: నైపుణ్యానికి AI పోర్టల్
NEWS Nov 05,2025 10:51 am
రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు టెక్నాలజీతో ప్రభుత్వం ‘నైపుణ్యం’ పోర్టల్‌ను ప్రవేశపెడుతోంది. అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు AIతో ఇంటర్వ్యూను ప్రవేశ పెడుతోంది. ప్లంబర్ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్‌ను ఆవిష్కరిస్తారు. నైపుణ్య కోర్సుల కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. అన్నిరకాల శిక్షణ వివరాలు పోర్టల్‌లో ఉంటాయి. అభ్యర్థి నచ్చిన కోర్సులో చేరవచ్చు.