కాంగ్రెస్ 30 వేల ఓట్ల మెజార్టీ: రేవంత్
NEWS Nov 04,2025 11:28 pm
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 30 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించబోతోందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రస్తుతం అందుతున్న పథకాలు కూడా ఆగిపోతాయని హెచ్చరించారు.