మరో కొత్త అధ్యయనానికి \'బాహుబలి\' తెర లేపాడు. యానిమేట్ సిరీస్ లో భాగంగా ‘బాహుబలి ది ఎటర్నెల్ వార్\' పార్ట్ 1 రాబోతోంది. ఈ మేరకు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో బాహుబలి దేవేంద్రుడి మధ్య యుద్ధం మొదలైందనే కాన్సెప్ట్ మనకు చూపెట్టారు. దేవ-అసుర మధ్య జరిగే సంగ్రామంలో బాహుబలికి ఎలాంటి సంబంధం ఉందో తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తుండగా రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేయనున్నారు.