చైనాలో తొలి AI హాస్పిటల్ షురూ!
NEWS Nov 04,2025 06:42 pm
చైనా పరిశోధకులు ఓ AI హాస్పిటల్ టౌన్ తయారు చేశారు. దీనికి "ఏజెంట్ హాస్పిటల్" అని పేరు పెట్టారు. దీన్ని సింఘువా యూనివర్సిటీ డెవలప్ చేసింది. ఈ AI ఆసుపత్రిలో వర్చువల్ రోగులకు AI డాక్టర్లు చికిత్స చేస్తారు. ఈ AI డాక్టర్లు, నర్సులు, రోగులు అందరూ వాటంతట అవే పనిచేసుకుంటాయి. ఈ AI డాక్టర్లు కేవలం కొన్ని రోజుల్లోనే 10వేల మంది రోగులకు చికిత్స చేయగలరు. అదే పని మానవ డాక్టర్లకు రెండేళ్ల పట్టొచ్చు. AI డాక్టర్లు MedQA డేటాసెట్‌లో 93% కచ్చితత్వాన్ని సాధించారు. ఈ AI ఆసుపత్రి ద్వారా అందరికీ నాణ్యమైన, చవకైన, సులభంగా దొరికే ఆరోగ్య సేవలను అందించవచ్చు.