జూబ్లీహిల్స్ బైపోల్ పై జోరుగా బెట్టింగ్స్!
NEWS Nov 04,2025 06:35 pm
హైదరాబాద్: జూబ్లీహిల్స్ గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగులతో సమానంగా సాగుతున్నాయి. గెలుపు, ఓటములతోపాటు అభ్యర్థి సాధించే మెజార్టీపైనా, సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయులు బెట్టింగులు కాస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లున్నా అందులో 50 శాతం మందే అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నారు. మరో వైపు సర్వే సంస్థల పంట పండుతోంది. ఇదే క్రమంలో సర్వేలను చూస్తున్న బెట్టింగ్ రాయుళ్లు బుకీలను ఆశ్రయిస్తున్నారు. కూకట్ పల్లి కేంద్రంగా ఈ బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది.