చత్తీస్‌ఘడ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్ దగ్గర ఆగి ఉన్న గూడ్సు రైలును కోర్బా ప్యాసింజన్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. ప్యాసింజర్ రైలు ఇంజన్ గూడ్సు రైలు పైకి ఎక్కింది. చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అధికారులు ఇంకా ఖచ్చితమైన సంఖ్యలను నిర్ధారించలేదు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.