పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేత
NEWS Nov 04,2025 06:31 pm
పెద్దపల్లి: రాబోయే 3 రోజులపాటు జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావొద్దని రైతులను కలెక్టర్ కోయ శ్రీహర్ష విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోలు అంశంపై కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పత్తి జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్స్, సీసీఐ, ప్రైవేట్ కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సీసీఐ విధించిన ఎల్–1, ఎల్–2, ఎల్–3 విధానం, ఇతర జిల్లాల రైతులకు అనుమతి, ఎకరానికి 7 క్వింటాల పరిమితి వంటి నిబంధనలపై అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వివరించారు.