ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
NEWS Nov 04,2025 02:24 pm
హైదరాబాద్: ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. ఈనెల 6 నుంచి ఈ కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. 6న భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లను విచారిస్తారు. 13న కామారెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కేసు విచారించనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన విషయం తెలిసిందే.