భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ
NEWS Nov 04,2025 12:36 pm
భారత మహిళల జట్టు వరల్డ్ కప్‌ను గెలుచుకోవడంతో క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ 25 నుంచి 100% వరకు పెరిగింది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ.. సోషల్ మీడియా అకౌంట్లకు ఒక్కసారిగా ఫాలోవర్లూ పెరిగారు. జెమీమా రోడ్రిగ్స్.. బ్రాండ్ వాల్యూ 100% వరకు పెరిగింది. జెమీమా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు.. ₹75 లక్షల నుంచి ₹1.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె.. రెడ్ బుల్, బోట్, Surfxlకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. స్మృతి మంధాన ఇప్పటికే 16 బ్రాండ్‌లకు ప్రచారకర్త. ఒక్కో బ్రాండ్‌కు రూ.1.5 నుంచి 2 కోట్ల వరకు సంపాదిస్తోంది. వరల్డ్ కప్ విజయంతో కొన్ని గంటల్లోనే టీమ్‌ఇండియా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది.