తిరుమల: హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు కుటుంబసమేతంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శనం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు ఆలయ అధికారులకు గంగాళాన్ని భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులుకు ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.