మెట్‌పల్లి డిపో ఆర్టీసీ బస్సు ప్రమాదం
NEWS Nov 04,2025 12:03 pm
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ముందుకు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.