భీమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు
NEWS Nov 04,2025 12:05 pm
కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బంగారుమెట్టు–పి.భీమవరం రోడ్డుపై ఉన్న భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ఎల్బిపి అగ్రహారం, వడ్డాది, పి.భీమవరం, కొన్నెంపూడి, దిబ్బిడి, విజయరామరాజుపేట, బంగారుమెట్టు గ్రామాల భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి “హర హర మహాదేవ శంభో శివ శంకర” నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.