7న దేశమంతా 'వందేమాతరం' ఆలపించాలి
NEWS Nov 03,2025 09:13 pm
వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించాలని కేంద్రం కోరింది. ఆ రోజున పౌరులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, వైద్యులు, టీచర్లు, దుకాణదారులు, ఇతర వర్గాల ప్రజలంతా పాల్గొనాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఆరోజు అన్ని రాష్ట్రాల్లో గవర్నర్, సీఎం నేతృత్వంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది.