తిరుమలలో 7 అడుగుల ఎత్తైన మహిళ సందడి చేశారు. సోమవారం.. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు ఈ ఎత్తైన మహిళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం.