₹ 2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు
NEWS Nov 03,2025 08:50 pm
AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది’ అని ప్రెస్‌మీట్‌లో వివరించారు.