ప్లేయర్లకు డైమండ్ నెక్లెస్‌ల గిఫ్టులు!
NEWS Nov 03,2025 08:48 pm
మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ప్లేయర్లకు సూరత్ (గుజరాత్) వ్యాపారవేత్త, MP గోవింద్ ఢోలకియా స్పెషల్ గిఫ్టులను ప్రకటించారు. భారతీయులు గర్వపడేలా అమ్మాయిలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, వారికి వజ్రాల ఆభరణాలు, ఇళ్లకు అమర్చేందుకు సోలార్ ప్యానెళ్లను గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విజయం మన దేశానికి కొత్తవెలుగులు తెచ్చిందని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.