ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యుల ఔదార్యం
NEWS Nov 03,2025 03:24 pm
చీడికాడ (మం) నీలగిరి వార్త రిపోర్టర్ కుమార్ భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సహోద్యోగికి చోడవరం ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు సహాయక హస్తం అందించారు. సాటి మిత్రునికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో తమ సొంత నిధులతో సేకరించిన ₹11 వేల ఆర్థిక సహాయాన్ని అనకాపల్లి జిల్లా యూనియన్ అధ్యక్షులు భీమరశెట్టి వెంకటేష్ చేతుల మీదుగా అందజేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వై. నాగు, ప్రెస్ క్లబ్ లీడర్లు శరగడం రాజు, ఉండా తాతారావు, యూనియన్ సభ్యులు కొత్తూరు వాసు, దేవి మోహన్ తదితరులు పాల్గొన్నారు.