అల్లూరి జిల్లాను విడదీసే కుట్రలు మానుకోండి
NEWS Nov 03,2025 08:59 pm
రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విస్తృత నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి పలు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీల ఏకైక ఏజెన్సీ జిల్లా అని, దీనిని ముక్కలు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపే ప్రయత్నాలు జరిగితే, ప్రభుత్వం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హెచ్చరించారు. ప్రతి ఆదివాసీ తమ జిల్లా గౌరవాన్ని కాపాడే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.