మత్స్యగుండం శైవక్షేత్రంలో కార్తీక పౌర్ణమి
NEWS Nov 03,2025 08:57 pm
కార్తీక పౌర్ణమి సందర్భంగా హుకుంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రం మత్స్యగుండం దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ దేవాలయ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలతో వారిని సత్కరించారు. భక్తుల సౌకర్యార్థం ఐదుగురు సివిల్ కానిస్టేబుల్లు, ఇద్దరు సచివాలయ మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, సూర్యనారాయణ నాయుడు, మత్స్య కొండ బాబు, గోపాలపాత్రుడు, రాంబాబు నాయుడు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.