మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడంలో తెలుగు అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి కూడా తన వంతు పాత్ర పోషించింది. ఆమెది కడప జిల్లా వీరపునాయునిపల్లె (మం) ఎర్రమల్లె గ్రామం. ప్రతి మ్యాచ్‌లోనూ కీలక పాత్ర పోషించింది. బౌలర్లలో దీప్తి శర్మ (22) తరువాత అత్యధిక వికెట్లు (14) తీసిన బౌలర్‌గా నిలిచింది. 21 ఏళ్ల శ్రీ చరణి గత ఏప్రిల్‌లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. బ్యాటర్లను కదలికలను బట్టి బంతులు వేయడం ఆమె ప్రత్యేకత. వైవిధ్యంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంది.