కోచ్ పాదాలను తాకి కృతజ్ఞతాభావం!
NEWS Nov 03,2025 02:01 pm
భారత మహిళా జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలవడంతో 140 కోట్ల మంది భారతీయుల కళ్లు చెమ్మగిల్లాయి. ఈ భావోద్వేగ సమయంలో స్టేడియంలోనూ అద్భుతమైన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. కెప్టెన్ కౌర్, తమ కోచ్ అమోల్ మజుందార్ పాదాలను తాకి కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. ఇది గురు-శిష్యుల బంధాన్ని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా అమోల్‌కు అప్పట్లో టీమిండియాకు ఆడే ఛాన్స్ రాలేదు.