బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత
MLA కాలె యాదయ్యకు నిరసన
NEWS Nov 03,2025 01:27 pm
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద స్థలానికి చేరుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు స్థానికులు తీవ్ర నిరసన తెలిపారు. “ఎమ్మెల్యే డౌన్ డౌన్” అంటూ.. రోడ్డు నిర్మాణ పనుల్లో ఆలస్యం చేస్తున్నారని, ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు విమర్శించారు. ఎమ్మెల్యేపైకి రాళ్లు ఎత్తుకున్న ఘటన చోటు చేసుకుంది. బస్సును ఘటనాస్థలం నుండి తరలించవద్దని స్థానికులు పట్టబట్టారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య కారు ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయారు.