TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్‌లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.