భార్య కుటుంబ సభ్యుల దాడిలో
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
NEWS Nov 03,2025 01:14 pm
టంగుటూరు: భార్య కుటుంబ సభ్యుల దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పల్లపు వంశీ(30) మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం తన్నీరు దివ్యకీర్తితో వివాహమైన వంశీ, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో దివ్యకీర్తి పుట్టింట్లో ఉంటోంది. పెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని వంశీ టంగుటూరుకు వచ్చినప్పుడు భార్య ఇంట్లో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మామ సుబ్రహ్మణ్యం, బావమరిది జయప్రకాశ్ దాడి చేయగా వంశీ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.