నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి చేసిన మానేపల్లి జూవెల్లరి యాడ్ వైరల్ గా మారింది. ఈ యాడ్ ఆమె అందం, నేచురల్ యాక్టింగ్ ఆకట్టుకున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరైతే తేజస్విని రకుల్ ప్రీతి సింగ్ లా ఉందంటూ, హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న తేజస్విని, బాలయ్య టాక్‌షో ‘అన్‌స్టాపబుల్’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.