ఈనాడు క్లిప్పింగ్స్‌పై కాపీరైట్ హెచ్చరిక
NEWS Nov 03,2025 11:32 am
HYD: పత్రిక క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈనాడు యాజమాన్యం హెచ్చరించింది. క్లిప్పింగ్స్‌ను పబ్లిష్ చేయడం, షేర్ చేయడం కాపీరైట్ చట్టానికి విరుద్ధమని, ఇటువంటి చర్యలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. ఈనాడు ప్రకటనలో, “ఈ పేపర్ క్లిప్పింగ్స్ పత్రికలోని కంటెంట్‌కు కాపీరైట్ రక్షణ ఉంది. అనుమతి లేకుండా వాటిని సోషల్ మీడియా లేదా ఇతర వేదికల్లో ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం” అని తెలిపింది.