ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి
డిమాండ్ చేస్తూ కళాశాల బంద్
NEWS Nov 03,2025 11:35 am
కోరుట్ల: గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రామకృష్ణ డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థులు బంద్ నిర్వహించారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.