రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (మం) మీర్జాగూడలో రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయడ్డారు. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దానికింద కూరుకుపోయారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్‌తో పాటు 7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది.