సమాన వేతనం తెచ్చిన ప్రపంచకప్
NEWS Nov 03,2025 09:10 am
నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టుకున్న క్షణంలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్ విజయం 3 ఏళ్ల క్రితం బీసీసీఐ తీసుకున్న “సమాన వేతనం” విధానానికి దక్కిన ప్రతిఫలమూ. మహిళలకు సమాన వేతనం, మెరుగైన సౌకర్యాలు, WPL అనుభవం ఈ విజయానికి పునాది వేశాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా “సమానత్వమే విజయానికి దారి” అని పేర్కొన్నారు. ఈ గెలుపు మహిళల క్రీడలకు కొత్త మార్గదర్శకంగా నిలిచింది.