‘జాగృతి జనం బాట’ పోస్టర్ ఆవిష్కరణ
NEWS Oct 16,2025 03:18 pm
కామారెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ‘జాగృతి జనం బాట’ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జాగృతి యువజన నాయకులు జొన్నల వినోద్, జొన్నల రాము కలిసి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ పాల్గొన్నారు.